శివ్వంపేట(నర్సాపూర్)ః రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత నిస్తోందని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. మండల పరిధి దంతన్‌పల్లిలో ఆర్‌ఆర్‌ఆర్ శీతల గిడ్డంగి, వేర్‌హౌస్, లాజిస్టిక్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఆధ్వర్యంలో కోల్ట్ స్టోరేజ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...సాగులో రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తూ ప్రభుత్వం సబ్సిడీ పై అందిస్తున్న వ్యవసాయ పరికరాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రామిరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు గజేంద్రుల మమత, నాయిని మమతరెడ్డి తదితరులున్నారు. పబ్లిక్ స్కూల్ తరలించొద్దు మండలానికి మంజూరైన పబ్లిక్ స్కూల్ వెల్దుర్తిలోనే నెలకొల్పాలని వెల్దుర్తి గ్రామస్తులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. పబ్లిక్ స్కూల్ నిర్వహణకు వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 13 తరగతి గదులు ఖాళీగా ఉన్నాయని 5 ఎకరాల్లో విశాలమైన మైదానం ఉందని ఇక్కడ కాదని మరోచోట పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయకుండా మండల కేంద్రంలోనే ప్రారంభించాలని మంత్రి గ్రామస్తులు విన్నవించారు.


