మెదక్‌జోన్: స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా బస్టాండ్, రైల్వే స్టేషన్, సినిమా థియేటర్లు, కలెక్టరేట్, కోర్టు ప్రాంగణంతో పాటు ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ప్రత్యేక పరికరాలతో అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు, పరిసరాలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ తనిఖీల్లో ఎస్సై విఠల్, హెడ్ కానిస్టేబుళ్లు ఫషియొద్దీన్, రవీందర్, కానిస్టేబుళ్లు నర్సింలు, దుర్గ ప్రసాద్, రాజేశ్ పాల్గొన్నారు.
డాగ్ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు


