చిన్నశంకరంపేట(మెదక్): ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రత్యామ్నాయంగా కొబ్బరి పీచుబొమ్మల తయారీకి మహిళా సంఘాలకు శిక్షణ అందిస్తున్నట్లు నాబార్డ్ మెదక్ జిల్లా ఏజీఎం కృష్ణతేజ తెలిపారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని మహిళా సమైక్యా సభ్యులకు కొబ్బరిపీచు ఉత్పత్తుల తయారీపై ఆవగాహన కల్పించారు. మహిళా సంఘాల సభ్యులు ముందుకు వచ్చి ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్‌కుమార్, కోఆర్టినేటర్ గోపిరెడ్డి, ఐకేపీ ఏపీఎం రాములు ఉన్నారు.


