ఐకమత్యంతో ముందుకు సాగాలి | - | Sakshi
Sakshi News home page

ఐకమత్యంతో ముందుకు సాగాలి

Aug 15 2026 7:23 AM | Updated on Aug 15 2026 7:23 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌): దేశపౌరులు ఐకమత్యంతో ముందుకు సాగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్‌ మల్లేశ్‌ గౌడ్‌ తెలిపారు. శుక్రవారం కౌడిపల్లి 200 మీటర్ల జాతీయ జెండాతో హర్‌ ఘర్‌ తిరంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల వల్లే ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామని చెప్పారు. దేశరక్షణకు అందరం ఐకమత్యంతో ఉండాలన్నారు. ఈ సందర్భంగా కౌడిపల్లిలో 765డి జాతీయ రహదారితోపాటు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్‌, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ, తహసీల్దార్‌ కృష్ణ, ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి, ఎంఈఓ బాలరాజు, డీఎఫ్‌ఆర్‌ఓ పృథ్వీ, సర్పంచ్‌లు కృష్ణాగౌడ్‌, శేఖులు, హెచ్‌ఎంలు లలితదేవి, సాజిద్‌అలి, సురేందర్‌రెడ్డి, నాయకులు కొండల్‌, లక్ష్మణ్‌ సాయి, అనీల్‌, మోమిన్‌, బీజేవైం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement