కమీషన్ల పర్వం | - | Sakshi
Sakshi News home page

కమీషన్ల పర్వం

Aug 15 2026 7:23 AM | Updated on Aug 15 2026 7:23 AM

కాంగ్రెస్‌

హయాంలో

రామాయంపేట, నిజాంపేట(మెదక్‌): కాంగ్రెస్‌ హయాంలో కమీషన్ల దందా కొనసాగుతోందని, దీంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడం లేదని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి ఆరోపించారు. నిజాంపేట మండలం చల్మెడ కమాన్‌ నుంచి నందగోకుల్‌ వరకు అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు పనులను శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. బిల్లుల కోసం ఏకంగా ఎనిమిది నుంచి పది శాతం వరకు కమీషన్లు డిమాండ్‌ చేస్తుండటంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారని ఆరోపించారు. కంకర పోసి వదిలేసిన ఈ రహదారిపై గుంతలు పడి ప్రయాణం ప్రమాదకరంగా మారిందన్నారు. నిజాంపేట నుంచి నస్కల్‌, నందగోకుల్‌, చల్మెడ కమాన్‌ వరకు 15 కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మాణానికిగాను బీఆర్‌ఎస్‌ హయాంలోనే రూ. 13 కోట్లు మంజూరయ్యాయని గుర్తుచేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయి రెండున్నరేళ్లు గడిచినా ఎందుకు పనులు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. ఈ విషయమై మెదక్‌ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో నస్కల్‌ గ్రామస్తులు నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. నాలుగు కిలోమీటర్లు మాత్రమే తారు రోడ్డు నిర్మించారని, మిగతా పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని చెప్పారు. వారం రోజుల్లో పనులు ప్రారంభించకపోతే మహా ధర్నా, పాదయాత్ర చేపడుతామని హెచ్చరించారు. పార్టీ మండలశాఖ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కల్వకుంట సర్పంచ్‌ కొండల్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్‌ బాపురెడ్డి, బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ కన్వీనర్‌ రంజిత్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ సంపత్‌, పార్టీ సీనియర్‌ నాయకులు గౌస్‌, నర్సింలు, అబ్దుల్‌ అజీజ్‌, భాస్కర్‌రావు, శ్రీకాంత్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ఎనిమిది నుంచి పది శాతం కమీషన్లే..

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement