కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే చెరువులు గుంటల్లోకి భారీస్థాయిలో వర్షపునీరు వచ్చి చేరుతోంది. చిన్న చెరువులు, కుంటలు ఇప్పటికే అలుగు పారుతున్నాయి. వరిగుంతం శివారులోని కుడి చెరువు వర్షపు నీటితో నిండి అలుగు పారుతుండటంతో చేపలు పడుతూ చిన్నారులు, పెద్దల సందడి చేస్తున్నారు. అలుగు పైనుంచి దూకి వస్తున్న నీటిలో నుండి చిన్న చేపలు వస్తుండటంతో వాటిని పట్టేందుకు చిన్నారులు నానా రకాలుగా పడుతున్న దృశ్యాలను శనివారం ‘సాక్షి’తన కెమెరాలో బంధించింది. కొల్చారం(నర్సాపూర్)
చెరువు అలుగు వద్ద చేపలు పడుతున్న దృశ్యాలు


