పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా నిలవాలని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజకుమార్ విజ్ఞప్తి చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం పెద్ద శంకరంపేటలో చేనేత కార్మికులు పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కండేయ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...చేనేత వృత్తిమీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న చేనేత కార్మికులందరికీ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం అందజేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిరిగా తెలంగాణలోనూ చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ప్రతీ ఒక్క చేనేత కార్మికుడికి ఆర్థికసాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మేకల జయరాములు, మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు మహంకాళి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలి రాష్ట్ర సంఘం అధ్యక్షుడు రాజ్‌కుమార్


