నర్సాపూర్: పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ తన హోదాను విస్మరించి మాజీమంత్రి హరీశ్‌రావుపై ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే సునీతారెడ్డి హితవు పలికారు. గురువారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ నాయకులు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తారని, మాజీమంత్రి హరీశ్‌రావు తన వ్యక్తిగత పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్తే అక్కడ క్షుద్ర పూజలు చేశారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలను ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు ఇస్తానన్న రెండున్నర వేల రూపాయలు, కల్యాణలక్ష్మి పథకం ద్వారా తులం బంగారం, యువతులకు స్కూటీ తదితర హామీల అమలు ఎక్కడని ప్రశ్నించారు. కాంగ్రెస్ వైఫల్యాలను, ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఎదురుదాడి రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్తారన్నారు.
జయశంకర్‌కు నివాళులు
ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని సునీతారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఆమె వెంట బీఆర్‌ఎస్ నాయకులు శేఖర్, నయీమోద్దీన్, భిక్షపతి, సత్యంగౌడ్, షేక్‌హుస్సేన్ తదితరులున్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి


