కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం రూపొందించిన ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారానే సబ్సిడీ ఎరువుల విక్రయాలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఎరువుల విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్)యాప్ రూపొందించినట్లు తెలిపారు. ఈ యాప్ ఈనెల 6వ తేది నుంచి అమలులోకి వస్తుందన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో పారదర్శకంగా అందిస్తూ, ఎరువుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో యాప్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎరువుల కొనుగోలు, పంపిణీ, నిల్వలు, సబ్సిడీ, విక్రయాల పర్యవేక్షణ ప్రక్రియలన్నీ ఒకే వేదికపైకి రానున్నట్లు తెలిపారు.


