● పరిష్కారానికి కొత్త సాప్ట్‌వేర్
● వారం రోజుల్లో అందుబాటులోకి పైలెట్ ప్రాజెక్ట్‌గా కొంటూరు ఎంపిక
మెదక్ కలెక్టరేట్: భూ సమస్యల పరిష్కారానికి కొత్త సాప్ట్‌వేర్ రూపొందించామని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో రూపకల్పన చేస్తున్న నూతన సాఫ్ట్‌వేర్‌పై సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీప్రసన్న, ఎన్‌ఐసీ సైంటిస్ట్ సీసీ సంధ్య, ల్యాండ్ రికార్డ్స్ జిల్లా ఏడీ కిషన్, అదనపు కలెక్టర్ నగేశ్‌తో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ రీసర్వే జరిగిన గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న నూతన సాప్ట్‌వేర్‌ను వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. మెదక్ మండలంలోని కొంటూరు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామన్నారు. అంతముందు మెదక్ మండలం కోంటూరు గ్రామాన్ని సర్వే డిపార్ట్‌మెంట్ అధికారులు సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు.


