
బోధన మెరుగుపర్చుకోవాలి
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని కేజీబీవీని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ప్రశ్నలు వేసి వారి నుంచి జవాబులు రాబట్టారు. బోధనను మరింత మెరుగుపర్చుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈసందర్భంగా డైనింగ్ హాల్‌ను పరిశీలించి భోజనం రుచి చూశారు. నాణ్యమైన భోజనంతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రిన్సిపాల్ గీతకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశా రు. మలేరియా పరీక్షలు జరుపుతున్నారా..? అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ నెలలో ఎన్ని ప్రసవాలు జరిగాయని ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజ లు వ్యక్తిగత శుభ్రత పాటించేలా చైతన్య పర్చాలని చెప్పారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్