
కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
మెదక్ మున్సిపాలిటీ: జాతీయస్థాయి కరాటే పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఆదివారం హైదరాబాద్‌లో రెంజుకి షోటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో 3వ జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది విద్యార్థులు హాజరైనట్లు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు నగేశ్ తెలిపారు. ఈ పోటీల్లో పట్టణానికి చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి మెడల్స్ సాధించినట్లు వెల్లడించారు. మొత్తం 18 బంగారం, 9 వెండి, 3 బ్రౌనజ్ మెడల్స్ సాధించారని వివరించారు.