
యూరియా సరఫరాలో విఫలం
శివ్వంపేట(నర్సాపూర్): రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. ఆదివారం శివ్వంపేట సొసైటీలో యూరియా రావడంతో ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. పోలీసుల పర్యవేక్షణలో పంపిణీ చేశారు. ఈసందర్భంగా రైతులతో కలిసి ఎమ్మెల్యే ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. కేసీఆర్ హయాంలో యూరియా కొరత లేదన్నారు. ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయిందన్నారు. రైతులకు కనీసం యూరియా సైతం ఇవ్వడం చేతకావడం లేదని విమర్శించారు. తక్షణం రైతులకు సరపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేశ్‌గుప్త, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, నాయకులు రమణగౌడ్, రమాకాంత్‌రెడ్డి, యాదాగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి