
వంతెన.. అంతేనా?
మనోహరాబాద్(తూప్రాన్): ఏళ్లు గడుస్తున్నా 44వ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి పనులు పూర్తి కావడం లేదు. జాతీయ రహదారి మీదుగా నూతనంగా చేపట్టిన మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వేలైన్ వెళ్తున్న క్రమంలో వాహనదారులకు అనువుగా మండలంలోని రామాయపల్లి వద్ద 2018లో రూ. 108 కోట్లతో అండర్‌పాస్, రైల్వే బ్రిడ్జి పనులను ప్రారంభించారు. కానీ ఏళ్లు గడస్తున్నా పనుల్లో పురోగతి లేదు. వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. పనులు ఆలస్యం అవుతుండటంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఏళ్లు గడుస్తుండటంతో వ్య యం సైతం పెరిగింది. రూ. 108 కోట్ల నుంచి రూ. 117 కోట్లకు పెరిగింది. స్టీలు వంతెన ఏర్పాటుకు అనుమతులు లేటుగా రావడంతోనే పనులు ఆలస్యమయ్యాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. నిత్యం భారీగా రాకపోకలు సాగించే రహదారి కావడంతో వాహనదారులకు సమస్యలు తప్పడం లేదు. అంతేకాకుండా వర్షా లు వస్తే ప్రత్యామ్నాయ దారులను ఎంచుకుంటున్నారు. దీంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని వాహనదారులు కోరుతున్నారు.
త్వరగా పూర్తి చేయాలి
రైల్వే వంతెన పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. వర్షాలు పడుతుండటంతో భారీ వాహనాలకు సమస్యలు తప్పడం లేదు. గంటల కొద్ది బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి పనులు పూర్తి చేయాలి.
– భాస్కర్, ధర్మరాజ్‌పల్లి
వచ్చే నెలలో అందుబాటులోకి..
రైల్వేశాఖ నుంచి నాణ్యతా నియమాలు, అనుమతులు.. తదితర కారణాలతో పనుల్లో ఆలస్యం జరిగింది. పై అధికారుల సహకారంతో మిగిలిన పనులను వచ్చే నెలలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేస్తాం.
– శ్రీనివాసరావు,
ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్
●
ఏళ్లుగా కొనసా..గుతున్న
రైల్వే బ్రిడ్జి పనులు
జాతీయ రహదారిపై
వాహనదారులకు తప్పని పాట్లు

వంతెన.. అంతేనా?

వంతెన.. అంతేనా?