బుల్లి క్రికెట్‌ స్టార్‌ సంచలనం : స్టైలిష్ బ్యాటింగ్‌తో సచిన్‌ ఫిదా | test-sopore 9 year old cricket sensation wins hearts sachin tendulkar | Sakshi
Sakshi News home page

బుల్లి క్రికెట్‌ స్టార్‌ సంచలనం : స్టైలిష్ బ్యాటింగ్‌తో సచిన్‌ ఫిదా

Apr 1 2024 3:14 PM | Updated on Apr 1 2024 3:30 PM

test-sopore 9 year old cricket sensation wins hearts sachin tendulkar

హర్మత్ ఇర్షాద్ భట్‌

 సోషల్‌ మీడియాలో  సంచలనం  హర్మత్ ఇర్షాద్ భట్‌

ప్రశంసలు కురిపించిన సచిన్‌  టెండూల్కర్‌ 

 

క్రికెట్‌పై  అమ్మాయిలు చూపిస్తున్న ఆసక్తి  మహిళా క్రికెట్‌పై ఆశల్ని మరింత పెంచుతోంది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ క్రికెట్‌ మహిళలు స్టార్లుగా సత్తా చాటుతున్న నేపథ్యంలో  తాజాగా ఒక సంచలన తార అవతరించడం విశేషంగా నిలిచింది.  తొమ్మిదేళ్లకే  అత్యుత్తమ ప్రతిభతో  ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది. దిగ్గజాలను సైతం అబ్బుర పరుస్తోంది.

 

ఎడమచేతితో బ్యాటింగ్ చేస్తూ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను ఆకట్టుకునే స్టైలిష్ బ్యాట్ స్వింగ్‌తో మైదానం నలుమూలలకు బంతిని పరుగులు పెట్టించింది. గొప్ప క్రికెటర్‌గా రాణించాలని కలలు కంటోంది. 

కశ్మీర్‌లోని సోపోర్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక హర్మత్ ఇర్షాద్ భట్.  సాధారణ డ్రైవర్‌ కుమార్తె. బుమై (జైంగీర్)లో రెండో తరగతి చదువుతోంది. ఇటీవల ప్లేగ్రౌండ్‌లో అబ్బాయిల టీంతో ఆడుతూ షాట్‌లు కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరలయింది. ఆమె లాంటి పిల్లలు క్రికెట్‌ను ఆస్వాదించడం చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ,  క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్  ఈవీడియోను రీ-ట్వీట్ చేశాడు.  యువత ఆడటం క్రికెట్ ఆడటం చూడటం తనకు చాలా సంతోషానిస్తోందంటూ టూ ట్వీట్‌చేశారు. దీంతో మరింత వైరల్‌ అయింది. పలువురు ఆమె టాటెంట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement