మెదక్‌లో గెలుపొంది.. ఉన్నత పదవుల్లోకి..!

- - Sakshi

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉప సభాపతిగా..

చరిత్రలో నిలిచిన నలుగురు నేతలు!

సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లా ఎంతో మందికి మంచి పదవులను అందించి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టింది. ప్రముఖులుగా చరిత్రలో లిఖించింది. గతంలో ఇక్కడి నుంచి పోటీచేసి గెలిచిన నాయకులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉప సభాపతి లాంటి ఉన్నతమైన పదవులు అలంకరించారు. అలా ఉన్నత పదవులను కైవసం చేసుకున్న వారంతా చరిత్రపుటల్లో నిలిచిపోయారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోను మెదక్‌ జిల్లాకు ఆ విధమైన ప్రత్యేక ఏర్పడింది. ఇందిరాగాంధీ మెదక్‌ నుంచి పోటీచేసి విజయం సాధించి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు.

పద్మాదేవేందర్‌రెడ్డి..
పద్మాదేవేందర్‌రెడ్డి 2001లో టీఆర్‌ఎస్‌ అవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2001లో రామాయంపేట జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం స్వరాష్ట్రం కోసం 2008లో కేసీఆర్‌ పిలుపు మేరకు తన పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీచేయగా ఓడిపోయారు. ఆ తరువాత 2009లో టికెట్‌ దక్కక పోవడంతో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 2014లో మెదక్‌ ఎమ్మెల్యేగా గెలుపొంది తెలంగాణలో తొలి ఉప సభాపతిగా పనిచేసి చరిత్రలో నిలిచారు. అనంతరం 2018లో సైతం ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు.

ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ
1980లో లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ ఎంపీగా ఇందిరాగాంధీ(కాంగ్రెస్‌) నుంచి పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొంది దేశ ప్రధానమంత్రి పదివిని అలంకరించారు. అప్పట్లో ఇందిరాగాంధీకి 3,01,577 ఓట్లు రాగా తన ప్రత్యర్థి జనతాపార్టీకి చెందిన జైపాల్‌రెడ్డికి 82,453 ఓట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ 2,19,124 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.

ముఖ్యమంత్రిగా అంజయ్య..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెదక్‌ జిల్లా రామాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన టి.అంజయ్య 1980 అక్టోబర్‌ నుంచి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలల పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పట్లో చెన్నారెడ్డి సీఎంగా కొనసాగుతున్న సందర్భంగా ఆయనను మార్చి అంజయ్యకు సీఎంగా అవకాశం కల్పించారు. ఆయన అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేస్తుండగా దానికి రాజీనామా చేసిన ఆయన ఎమ్మెల్యేగా ఎంపిక కాకుండానే సీఎం పదవి చేపట్టారు.

రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లో ఏదో ఒక చోటు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాలి. ఈ నేపథ్యంలో అప్పటికే రామాయంపేట ఎమ్మెల్యేగా ముత్యంరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండగా టి.అంజయ్య కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో రామాయంపేట స్థానానికి ఎన్నికలు నిర్వహించగా ప్రతిపక్షాలు సైతం నామినేషన్‌ వేయక పోవడంతో టి.అంజయ్య ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎం పదవిని అలంకరించి 16 నెలల పాటు కొనసాగారు.

ఉప ముఖ్యమంత్రిగా జగన్నాథరావు
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నుంచి పోటీచేసి ఎమ్మెల్యే గెలుపొందిన సీహెచ్‌ జగన్నాథరావు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 24 నుంచి సెప్టెంబర్‌ 20 వరకు సుమారు ఏడు నెలల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఇవి కూడా చదవండి: ఐదేళ్లు మీకోసం రక్తం ధారపోస్తా..! : మంత్రి గంగుల కమలాకర్‌

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-11-2023
Nov 09, 2023, 09:01 IST
హైదరాబాద్:  మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారెడ్డి స్థిర ఆస్తులు విలువ(భూములు, భవనాల విలువ) రూ.90,24,08,741...
09-11-2023
Nov 09, 2023, 08:40 IST
మహబూబ్‌నగర్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌షో విజయవంతమైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,...
09-11-2023
Nov 09, 2023, 08:32 IST
సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: హైదరాబాద్‌ సంపదపై ఆంధ్రావాళ్లు కన్నేశారని, వారికి వంతపాడుతున్న కాంగ్రెస్‌, బీజేపీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇరువై ఏళ్లుగా...
09-11-2023
Nov 09, 2023, 07:46 IST
సాక్షి, ఆదిలాబాద్‌: భైంసా మండలం బడ్‌గాం గ్రామానికి చెందిన బోస్లే గోపాల్‌రావుపటేల్‌ – కమలాబాయి దంపతులకు ఇద్దరు కుమారులు. బోస్లే...
09-11-2023
Nov 09, 2023, 07:33 IST
మేరే భారే మే జల్దీ మాముకు బోల్‌ దేరేం.. కుచ్‌ బీ నహీ హువా తోబీ మాముకు బోల్‌ రేం..(నేను...
09-11-2023
Nov 09, 2023, 07:31 IST
హైదరాబాద్ అధికార పక్షం దోస్తీ కోసం పాతబస్తీకే పరిమితమై ఎన్నికల బరిలో దిగే మజ్లిస్‌ పార్టీ ఈసారి అదనంగా మరో...
09-11-2023
Nov 09, 2023, 07:29 IST
మెరుగైన సామాజిక భవిష్యత్‌ను నిర్ణయించేది ఓటు హక్కు మాత్రమే. మంచి నాయకులను ఎన్నుకోవడానికి సరైన సమయం ఇదే. ఎన్నికల వేళ...
09-11-2023
Nov 09, 2023, 05:14 IST
సాక్షి, హైదరాబాద్‌:  ‘‘రైతుబంధు పెద్దవాళ్లకే ఇస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. నాకు రెండెకరాలు ఉంది. సంవత్సరానికి 20వేలు వస్తుంది పెట్టుబడికి. మరొకాయనకు...
09-11-2023
Nov 09, 2023, 05:07 IST
సాక్షి, ఆదిలాబాద్‌:  వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో కేసీఆర్‌ ఖేల్‌ ఖతం అవుతుందని, దుకాణం బంద్‌ అవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి...
09-11-2023
Nov 09, 2023, 03:56 IST
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/సాక్షి, ఆసిఫాబాద్‌:  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఏమీ లేకుండేదని.. ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఒక్కొక్కటీ సర్దుకుంటూ...
09-11-2023
Nov 09, 2023, 02:03 IST
సీఎం కేసీఆర్‌.. ఈ సార్‌తో ఎన్నికల్లో పోటీ అంటే.. అస్స లు మామూలు విషయం కాదు.. ఎప్పుడో నలభై ఏళ్ల...
09-11-2023
Nov 09, 2023, 01:46 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/ కరీంనగర్‌టౌన్‌: రాష్ట్రంలో బీఆర్‌ఎస్సో, కాంగ్రెస్సో అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు వచ్చే ప్రమాదముందని బీజేపీ జాతీయ...
08-11-2023
Nov 08, 2023, 19:07 IST
కాంగ్రెస్‌ సృష్టించే సునామీలో బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోతుందని రేవంత్‌రెడ్డి అన్నారు.
08-11-2023
Nov 08, 2023, 18:24 IST
తెలంగాణ ఎన్నికల వేళ.. వారం వ్యవధిలో నరేంద్ర మోదీ మరోసారి హైదరాబాద్‌కు.. 
08-11-2023
Nov 08, 2023, 13:33 IST
నల్లగొండ: తనకు సొంత ఇల్లు కూడా లేదని నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మంగళవారం...
08-11-2023
Nov 08, 2023, 12:44 IST
మహబూబ్‌నగర్‌: ‘కొడంగల్‌ నియోజకవర్గం నారాయణపేట జిల్లాలో ఉంది.. ఈ ప్రాంత బిడ్డనైన నేను టీపీసీసీ అధ్యక్షుడినయ్యా.. పాలమూరులో 14 సీట్లు...
08-11-2023
Nov 08, 2023, 11:01 IST
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై ఒకరు...
08-11-2023
Nov 08, 2023, 05:17 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్‌. ఆయన గొంతు నులిమి ఓడించడా నికి చాలా మంది...
08-11-2023
Nov 08, 2023, 05:09 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రైతులు బాగు పడాలని ఉచిత కరెంట్‌ ఆలోచన చేసినదే కాంగ్రెస్‌ పార్టీ అని, అసలు ఉచిత...
08-11-2023
Nov 08, 2023, 04:58 IST
గజ్వేల్‌: రజాకార్లకు సీఎం కేసీఆర్‌ వారసుడని, బీఆర్‌ఎస్‌ అవినీతి పాలనకు గజ్వేల్‌ నుంచే పాతరేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు... 

Read also in:
Back to Top