ఐదేళ్లు మీకోసం రక్తం ధారపోస్తా..! : మంత్రి గంగుల కమలాకర్‌

- - Sakshi

20 రోజులు నా కోసం పనిచేయండి!

కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌..

నామినేషన్‌ దాఖలు!

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: హైదరాబాద్‌ సంపదపై ఆంధ్రావాళ్లు కన్నేశారని, వారికి వంతపాడుతున్న కాంగ్రెస్‌, బీజేపీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇరువై ఏళ్లుగా ఆశీర్వదిస్తున్న ప్రజలు మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తన రక్తం ధారపోసి పనిచేస్తానని కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం కరీంనగర్‌ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసే ముందు కుటుంబ సభ్యులతో కలిసి నగరంలోని ప్రసన్నాంజనేయస్వామిని దర్శించుకున్నారు.

నామినేషన్‌ పత్రాలకు ప్రత్యేకపూజలు చేయించి బీఆర్‌ఎస్‌ నాయకులు కొత్త జైపాల్‌రెడ్డి, కంసాల శ్రీనివాస్‌, మెతుకు సత్యంతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి రెండుసెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలతో నగరంలో భారీర్యాలీ నిర్వహించారు. తెలంగాణచౌక్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.

కాంగ్రెస్‌, బీజేపీ చెబుతున్న కల్లబొల్లి మాటలు నమ్మవద్దని, వారిహయాంలో జరిగిన అభివృద్ధి, పదేళ్లల్లో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టాలని మళ్లీ ఆంధ్రా నాయకులు ఏకమవుతున్నారని, సీఎం కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించి హైదరాబాద్‌ సంపదను దోచుకెళ్లేందుకు తహతహలాడుతున్నారని ఆరోపించారు. ‘కేసీఆర్‌ లేని తెలంగాణ ఊహించుకోలేం.. తస్మాస్‌ జాగ్రత్త.. ఆ రెండు పార్టీలతో అప్రమత్తంగా లేకపోతే తెలంగాణ మళ్లీ అంధకారమవుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

20 రోజులు తన కోసం పనిచేస్తే ఐదేళ్లు మీకోసం తన రక్తం ధారపోస్తా అని భరోసా ఇచ్చారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని, ముచ్చటగా సీఎం కేసీఆర్‌ను మూడోసారి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. మతోన్మాదంతో ఒక అభ్యర్థి, భూ కబ్జాలతో మరో అభ్యర్థి ఓట్ల కోసం వస్తున్నారని, నగరాన్ని సర్వనాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఇలాంటి వారికి ప్రజలే తగిన శాస్తి చేయాలని సూచించారు.

మేయర్‌ సునీల్‌రావు మాట్లాడుతూ.. కేబుల్‌ బ్రిడ్జ్‌ కూలిపోతుందని బండి సంజయ్‌ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కరీంనగర్‌లో సంజయ్‌ ఏనాడూ తిరగలేదు కాబట్టి ఆయన కళ్లకు ఇన్ని రోజులు చేసిన అభివృద్ధి కనబడలేదని అన్నారు. నామినేషన్‌ వేసిన మంత్రి కమలాకర్‌కు ఎంఐఎం కరీంనగర్‌ అధ్యక్షుడు సయ్యద్‌ గులాం అహ్మద్‌ హుస్సేన్‌, నాయకులు మద్దతు తెలిపారు. నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ రెడ్డవేణి మధు పాల్గొన్నారు.

గంగుల ఆస్తులు రూ.25.50 కోట్లు!
మంత్రి కమలాకర్‌ తన అఫిడవిట్‌లో మొత్తం రూ.25.50 కోట్ల స్థిరచరాస్తులు, రూ.50 లక్షల బ్యాంకు రుణాలు, 8 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన ఆయన తన వద్ద రూ.2.25 లక్షలు, 436 తులాల బంగారు కడియాలు, బ్రాస్‌లెట్లు ఇతర ఆభరణాలు(రూ.2.45 కోట్లు), 1995 మోడల్‌ యమహా బైక్‌, దాదాపు రూ.70 లక్షల విలువైన భారత్‌ బెంజ్‌ కారవాన్‌ వాహనాలు ఉన్నాయన్నారు. ఆయన భార్య రజిత వద్ద రూ.3.15 లక్షలు, 800 తులాల ఆభరణాలు(రూ.4.5 కోట్లు) ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన తన ఆస్తులు రూ.24.5 కోట్లు, అప్పులు రూ.3.4 కోట్లుగా చూపించారు.
ఇవి చదవండి: ముధోల్‌ బరిలో అన్నదమ్ముళ్లు! ఆసక్తిగా పరిశీలిస్తున్న ప్రజలు!

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-11-2023
Nov 09, 2023, 07:46 IST
సాక్షి, ఆదిలాబాద్‌: భైంసా మండలం బడ్‌గాం గ్రామానికి చెందిన బోస్లే గోపాల్‌రావుపటేల్‌ – కమలాబాయి దంపతులకు ఇద్దరు కుమారులు. బోస్లే...
09-11-2023
Nov 09, 2023, 07:33 IST
మేరే భారే మే జల్దీ మాముకు బోల్‌ దేరేం.. కుచ్‌ బీ నహీ హువా తోబీ మాముకు బోల్‌ రేం..(నేను...
09-11-2023
Nov 09, 2023, 07:31 IST
హైదరాబాద్ అధికార పక్షం దోస్తీ కోసం పాతబస్తీకే పరిమితమై ఎన్నికల బరిలో దిగే మజ్లిస్‌ పార్టీ ఈసారి అదనంగా మరో...
09-11-2023
Nov 09, 2023, 07:29 IST
మెరుగైన సామాజిక భవిష్యత్‌ను నిర్ణయించేది ఓటు హక్కు మాత్రమే. మంచి నాయకులను ఎన్నుకోవడానికి సరైన సమయం ఇదే. ఎన్నికల వేళ...
09-11-2023
Nov 09, 2023, 05:14 IST
సాక్షి, హైదరాబాద్‌:  ‘‘రైతుబంధు పెద్దవాళ్లకే ఇస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. నాకు రెండెకరాలు ఉంది. సంవత్సరానికి 20వేలు వస్తుంది పెట్టుబడికి. మరొకాయనకు...
09-11-2023
Nov 09, 2023, 03:56 IST
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/సాక్షి, ఆసిఫాబాద్‌:  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఏమీ లేకుండేదని.. ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఒక్కొక్కటీ సర్దుకుంటూ...
08-11-2023
Nov 08, 2023, 19:07 IST
కాంగ్రెస్‌ సృష్టించే సునామీలో బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోతుందని రేవంత్‌రెడ్డి అన్నారు.
08-11-2023
Nov 08, 2023, 18:24 IST
తెలంగాణ ఎన్నికల వేళ.. వారం వ్యవధిలో నరేంద్ర మోదీ మరోసారి హైదరాబాద్‌కు.. 
08-11-2023
Nov 08, 2023, 13:33 IST
నల్లగొండ: తనకు సొంత ఇల్లు కూడా లేదని నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మంగళవారం...
08-11-2023
Nov 08, 2023, 12:44 IST
మహబూబ్‌నగర్‌: ‘కొడంగల్‌ నియోజకవర్గం నారాయణపేట జిల్లాలో ఉంది.. ఈ ప్రాంత బిడ్డనైన నేను టీపీసీసీ అధ్యక్షుడినయ్యా.. పాలమూరులో 14 సీట్లు...
08-11-2023
Nov 08, 2023, 11:01 IST
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై ఒకరు...
08-11-2023
Nov 08, 2023, 05:17 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్‌. ఆయన గొంతు నులిమి ఓడించడా నికి చాలా మంది...
08-11-2023
Nov 08, 2023, 05:09 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రైతులు బాగు పడాలని ఉచిత కరెంట్‌ ఆలోచన చేసినదే కాంగ్రెస్‌ పార్టీ అని, అసలు ఉచిత...
08-11-2023
Nov 08, 2023, 04:58 IST
గజ్వేల్‌: రజాకార్లకు సీఎం కేసీఆర్‌ వారసుడని, బీఆర్‌ఎస్‌ అవినీతి పాలనకు గజ్వేల్‌ నుంచే పాతరేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...
08-11-2023
Nov 08, 2023, 04:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నాలుగో జాబితాను బీజేపీ అధిష్టానం మంగళవారం విడుదల చేసింది. కసరత్తు...
08-11-2023
Nov 08, 2023, 04:45 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఫుల్‌టీమ్‌ రంగంలోకి దిగింది. పార్టీ అభ్యర్థులంతా ఖరారవడంతోపాటు బీఫారాల పంపిణీ మంగళ వారం...
08-11-2023
Nov 08, 2023, 04:26 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బీఆర్‌ఎస్‌ పార్టీకి హైకమాండ్‌ ఢిల్లీలో ఉండదని,  మన బాసులు తెలంగాణ ప్రజలేనని...
08-11-2023
Nov 08, 2023, 02:06 IST
కష్టపడి సాధించిన రాష్ట్రాన్ని ద్రోహుల చేతిలో పెట్టే కుట్ర జరుగుతోందని.. సమైక్యవాది చంద్రబాబుతో కలసి పనిచేస్తున్నవారు  తెలంగాణ వ్యతిరేకుల చేతుల్లో రాష్ట్రాన్ని...
07-11-2023
Nov 07, 2023, 11:58 IST
సాక్షి, ఖమ్మం: చట్టసభల్లో ప్రజాసమస్యలపై గళం వినిపించేది కమ్యూనిస్టులేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో...
07-11-2023
Nov 07, 2023, 11:35 IST
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్‌: ‘హలో రామన్న.. నమస్తేనే. మంచిగున్నవాయే. ఎట్లున్నది మనూళ్లె. అంత మనదిక్కే ఉన్నరు కదనే. ఇంతకు మన కులపోళ్లు ఎంతమంది... 

Read also in:
Back to Top