‘గిరి’.. మోడల్‌ సాగు | - | Sakshi
Sakshi News home page

‘గిరి’.. మోడల్‌ సాగు

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

పండ్ల తోటలు, కూరగాయలు, టేకు తదితర పంటల సాగు గిరిజన ప్రాంతాల్లో మోడల్‌ వ్యవసాయ విధానానికి శ్రీకారం పెట్టుబడి తగ్గించి ఆదాయం పెంచుకునే అవకాశం 15 గ్రామాల్లో 90 ఎకరాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు

సమగ్ర వ్యవసాయ విధానాన్ని చేపట్టాలనుకునే రైతులు పొలంలోని నేల స్వభావాన్ని తెలుసుకోవాలి. నీటి లభ్యత, భూమి విస్తీర్ణం, మార్కెట్‌కు ఉన్న దూరం వంటి అంశాలను అంచనా వేసుకోవాలి. ఆ తర్వాతే పంటల ఎంపికపై నిర్ణయం

తీసుకోవాలి.

నేలలోని పోషకాలను తెలుసుకుని అవసరమైన ఎరువులను వినియోగించాలి.

అనుకూలమైన పండ్లు, కూరగాయలు, అంతర పంటలను ఎంచుకోవాలి.

వర్షపు నీటిని ఒడిసిపట్టే పద్ధతులు, మల్చింగ్‌, బిందు సేద్యం వంటి విధానాలను అందుబాటులో ఉన్న మేరకు అనుసరించాలి.

పశువుల ఎరువు, కంపోస్టు వంటి వాటిని నేల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ఉపయోగించాలి.

ఏ పంటకు ఎప్పుడు డిమాండ్‌ ఉంటుంది? ఎక్కడ విక్రయిస్తే మంచి ధర వస్తుంది? అనే అంశాలను ముందుగానే తెలుసుకోవాలి.

విత్తనాలు, మొక్కలు, ఎరువులు, కూలీ, నీటి ఖర్చులు, వచ్చిన ఆదాయాన్ని నమోదు చేస్తే లాభనష్టాలు తెలుస్తాయి.

నార్నూర్‌: సాగులో నూతన పద్ధతులు, అనేక మార్పులు వస్తున్నాయి. ఒకే భూమిలో పలు రకాల పంటలు సాగు చేస్తూ, ఏడాది పొడవునా గిరిజన రైతులకు స్థిరమైన ఆదాయం అందించాలనే లక్ష్యంతో ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ ప్రాంతంలో భారతీయ ఆగ్రో ఇండస్ట్రీయల్‌ ఫౌండేషన్‌ (బీఏఐఎఫ్‌) ఆధ్వర్యంలో హెచ్‌డీఎఫ్‌సీ సౌజన్యంతో సమగ్ర వ్యవసాయ విధానం అమలవుతోంది. పైలట్‌ ప్రాజెక్టుగా 15 గ్రామాల్లో 90 ఎకరాల విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగులో కొత్త పద్ధతులు పరిచయం చేయడం, ఆదాయం పెంచుకునే మార్గాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు.

ఒకే భూమిలో..

నార్నూర్‌ మండలకేంద్రం, మహాగావ్‌, ఖంపూర్‌, ఖైర్డాట్వా, సుంగాపూర్‌, భీంపూర్‌, కొత్తపల్లి–హెచ్‌, ఉమ్రీ, మాన్కాపూర్‌, గంగాపూర్‌, తాడిహత్నూర్‌, బలాన్‌పూర్‌, గుంజాల, నాగల్‌కొండ, ఏంపల్లి తది తర గిరిజన ప్రాంతాల్లో సమగ్ర వ్యవసాయ విధా నం అమలవుతోంది. ఒకే భూమిలో కూరగాయలు, పండ్ల తోటలు, కలప జాతి మొక్కలను పెంచడంతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తోంది. పశుసంవర్ధక కార్యకలాపాలు, వర్షపు నీటి సంరక్షణ, సోలార్‌ ఆధారిత నీటి వినియోగం వంటి అంశాలను జోడించడం వల్ల సాగు ఖర్చులను నియంత్రించేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఈ విధానాన్ని అనుసరిస్తున్న రైతుల వార్షిక ఆదాయం రూ.90 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు పెరిగినట్లు అధికారులు పేర్కొటున్నారు. అయితే ఈ ఆదాయం భూమి విస్తీర్ణం, పంటల రకాలు, దిగుబడి, మార్కెట్‌ ధరలు, పెట్టుబడి వ్యయాలపై ఆధారపడి మారుతుంది.

కలప జాతి మొక్కలతో భరోసా

కూరగాయలు, స్వల్పకాలిక పంటలతో పాటు కల ప జాతి మొక్కలను పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. టేకు వంటి కలప జాతుల సాగులో మొ క్కల ఎంపిక, పెరుగుదల కాలం, భూమి వినియో గం, సంబంధిత చట్టాలు, అనుమతులపై ముందుగానే అవగాహన ఉండాలి. త్వరగా లాభాలు వస్తాయని భావించి అధికంగా పెట్టుబడి పెట్టకుండా, స్వల్పకాలిక ఆదాయం అందించే పంటలతో దీర్ఘకాలిక పంటలను సమతుల్యం చేసుకోవాలి.

పాటించాల్సిన మెలకువలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement