ఆశాజనకంగా ఆయిల్‌పామ్‌ | - | Sakshi
Sakshi News home page

ఆశాజనకంగా ఆయిల్‌పామ్‌

Oct 23 2026 12:03 AM | Updated on Oct 23 2026 12:03 AM

దండేపల్లి: జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగులో ఆయిల్‌పామ్‌ ఆశాజనకంగా ఉంది. మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీలు అందిస్తోంది. ఉచితంగా మొక్కల పంపిణీ, అంతర పంటల సాగుకు ఎకరాకు రూ.4200 చొప్పున వరుసగా నాలుగేళ్లపాటు అందించడంతోపాటు డ్రిప్‌ పరికరాలు రాయితీపై అందిస్తోంది. నాలుగేళ్ల తర్వాత పంటలు కోత దశకు చేరాయి. మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడంతోపాటు దిగుబడి సమయంలో అవసరమయ్యే పరికరాలకు రాయితీ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్న రైతుల్లో చిన్న, సన్నకారు వెనుకబడిన తరగతుల వారికి 50శాతం, పెద్ద రైతులకు 40శాతం వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. చెట్లు పైకి ఎక్కేందుకు నిచ్చెనలు, గెలలు కోసే పరికరాలు, కిందకు దించేందుకు వైర్‌ మెష్‌, చాప్‌ కట్టర్‌, స్లాషర్‌(గడ్డి కత్తిరించే యంత్రం), క్లస్టర్‌ హైరింగ్‌ సెంటర్‌ కోసం ప్రభుత్వం రాయితీ ఇవ్వనుంది. పంట సాగు చేసి నాలుగేళ్లు దాటిన రైతులందరికీ వీటిని అందించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆయిల్‌ పామ్‌ పంటను కొనుగోలు చేస్తున్న మ్యాట్రిక్స్‌ సంస్థ ఆధ్వర్యంలో పరికరాలు అందజేస్తున్నారు. రాయితీపై పరికరాలు అవసరమైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలో వివరాలు..

సాగు విస్తీర్ణం 4,212 ఎకరాలు

రైతులు సుమారు 360 మంది

పంట నాలుగేళ్లు పూర్తయింది 900ఎకరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement