బీసీల రాజ్యాధికార సాధనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

బీసీల రాజ్యాధికార సాధనే లక్ష్యం

Oct 23 2026 12:03 AM | Updated on Oct 23 2026 12:03 AM

పాతమంచిర్యాల: బీసీల ఆత్మగౌరవం, ఐక్యత, రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ప్రతియేటా బీసీ అలయి బలయి కార్యక్రమం నిర్వహిస్తున్నామని నేషనల్‌ పొలిటికల్‌ జస్టిస్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ వీజీఆర్‌ నారగోని, బీసీ టైమ్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు, ఇండియన్‌ నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఓబీసీ ప్రెసిడెంట్‌ పొట్లూరీ దేవి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్‌ హాల్‌లో బీసీ సమాజ్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన బీసీ అలయి బలయి కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు పండుగ సాయన్న 74వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓబీసీలంతా ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదిగినప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలిపారు. అగ్రవర్ణాల విభజన రాజకీయాలకు తావివ్వకుండా బీసీలు తమ బలం, నాయకత్వాన్ని చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేష్‌, పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డు శంకర్‌, సీనియర్‌ నాయకులు డాక్టర్‌ రఘునందన్‌, కర్రె లచ్చన్న, పెరిక సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు అత్తి సరోజ, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు సదానందం, కార్పొరేటర్‌ స్వరూప, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్‌ ఒడ్డేపల్లి మనోహర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement