లక్సెట్టిపేట: రైతుల సమస్యల దృష్ట్యా గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ నెల 23న సాగునీటిని విడుదల చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ప్రకటించారని మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ఐబీ ఆవరణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురువపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సాగునీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేశామని తెలిపారు. రైతులు ఇబ్బంది పడవద్దని, సాగునీటిని వినియోగించుకోవాలని తెలిపా రు. కడెం ఆయకట్టు చివరి వరకు నీటిని అందిస్తామని, ప్రాజెక్టుల్లో నీటి శాతం తక్కువ ఉండడంతో గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందిస్తున్నామని అన్నారు. రైతుల పంటలు చేతికి వచ్చే వరకు చేస్తామని హామీ ఇచ్చారు. పీఏసీఎస్ చైర్మన్ నాగభూషణం, మండల అధ్యక్షుడు రాజు, నాయకులు షాహిద్ అలీ, నర్సయ్య, చింత అశోక్ పాల్గొన్నారు.


