రోడ్డుప్రమాదంలో రిటైర్డ్‌ కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో రిటైర్డ్‌ కార్మికుడి మృతి

Oct 22 2026 11:57 PM | Updated on Oct 22 2026 11:57 PM

తాండూర్‌: మండలంలోని గోపాల్‌నగర్‌ మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రేచిని గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు చామంతుల శంకర్‌(65) మృతిచెందాడు. కుమారుడు మధుకర్‌ తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం తన తండ్రి శంకర్‌ దసరా పండుగ రోజున సామగ్రి కొనుగోలు చేసేందుకు రేచిని నుంచి తన స్కూటీపై ఐబీకి వెళ్లాడు. ఎంత సేపటికి ఇంటికి చేరలేదు. మంగళవారం సాయంత్రం వరకు వెతికిన ఆచూకీ దొరకలేదు. బుధవారం తాండూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. గోపాల్‌నగర్‌ మూలమలుపు వద్ద పొలంలో మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన యజమాని శ్రీనివాస్‌ స్థానికులకు తెలియజేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు మృతదేహాన్ని పరిశీలించి శంకర్‌దేనని ధ్రువీకరించారు. మూలమలుపు వద్ద స్కూటీ అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగి శంకర్‌ మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చికిత్స పొందుతూ

యువకుడు..

నస్పూర్‌: బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘ టనలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్సపొందుతూ మృతిచెందినట్లు సీసీసీ నస్పూర్‌ ఎస్సై తహిసినొద్దీన్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..విలేజ్‌ నస్పూర్‌కు చెందిన శ్రీపతి రా హుల్‌ (22) ఈనెల 20న రాత్రి తన బైక్‌పై మంచిర్యాల వైపు వెళ్తూ నస్పూర్‌ పీహెచ్‌సీ వద్ద జాతీ య రహదారి 63 పై అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. తీవ్రగాయాలైన అతన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి బాబాయ్‌ శ్రీపతి సురేష్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

క్షణికావేశం..

ఇద్దరికి ప్రాణపాయం

ఆసిఫాబాద్‌క్రైం: క్షణికావేశం కారణంగా ఇద్దరు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఘటన కాగజ్‌నగర్‌లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్పీఎం న్యూ కాలనీకి చెందిన సారంగపాణి(37) కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆయన కూతురు (13) మంటలార్పేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో ఆమెకు మంటలు అంటుకోగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై యాదగిరి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలైన తండ్రి, కూతుళ్లను చికిత్స నిమిత్తం వరంగల్‌ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement