దండేపల్లి: మండలంలోని తాళ్లపేట గ్రామంలో పోలీస్ పహారా గురువారం కొనసాగింది. ఈ నెల 18న సద్దుల బతుకమ్మ పండుగ రోజున కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మద్య వివాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో సోమవారం నుంచి గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ దసరా పండుగా రోజున మళ్లీ దాడులు జరిగాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నాలుగు రోజులుగా పోలీస్ పహారా కొనసాగిస్తున్నారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గురువారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేశారు.


