సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఓటరు ప్రత్యేక సమగ్ర పరిశీలన (ఎస్‌ఐఆర్) నోటీసులు, హియరింగ్ ప్రక్రియల్లో జిల్లాలోని పలుచోట్ల జాప్యం జరుగుతోంది. నోటీసులు అందుకున్న ఓటర్లు సకాలంలో తగిన ఽఆధారాలతో హియరింగ్‌కు రాకపోవడంతో ఓటరు ధ్రువీకరణలో ఆలస్యమవుతోంది. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల పరి ధిలోని ఓటర్ల తప్పులు, అన్‌మ్యాపింగ్ ఓటర్ల పరిశీ లన ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, నోటీసులు అందుకున్న చాలామంది ఓట ర్లు సకాలంలో స్పందించకపోవడంతో మరోసారి పరిశీలన చేయాల్సి వస్తోంది. నోటీసులు అందుకున్నవారిలో ఇప్పటివరకు 72వేల మంది హియరింగ్ గడువు తీరిపోయింది. వీరిలో కొందరికి మరోరోజు రీషెడ్యూల్ ఇస్తున్నారు. చాలామందికి తగిన ధ్రువపత్రాలు చూపించడంలోనే ఇబ్బందులు వస్తున్నాయి. జిల్లాలో ముసాఽయిదా ప్రకారం 6.61లక్షల మంది ఓటర్లున్నారు. వీటిలో 1,36,985 ఓట్లు అనామలిస్ కేటగిరీలో, మరో 33,983మంది ఓట్లు అన్‌మ్యాపింగ్‌లో ఉన్నాయి. ఈ రెండు కేటగిరీల్లో మొత్తం 1,70,967 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసి తగిన ధ్రువపత్రాలు పరిశీలించాక తుది జాబితాకు పంపాల్సి ఉంది. ఇందుకు ప్రతీ ఓటరు వివరాలను బీఎల్వోల నుంచి అసిస్టెంట్, రిటర్నింగ్ ఆఫీసర్, ఎన్నికల సిబ్బంది, జిల్లా ఎన్నికల అధికారి నుంచి కలెక్టర్ వరకు పరిశీలన చేయాల్సి ఉంది. రోజుకు సగటున 4,200 ఓట్లు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వరుసగా పండుగలు రావడంతోనూ పరిశీలనలో జాప్యం జరుగుతోంది.
రుజువుల కోసం తిప్పలు
ఎన్నికల నిబంధనల ప్రకారం తగిన ధ్రువపత్రాలు ఉంటేనే ఓటు కొనసాగే అవకాశముంది. 2002 ప్రకారం మ్యాపింగ్ జరుగుతుండగా, 2004 డిసెంబర్ తర్వాత పుట్టిన వారంతా తమ కుటుంబ స భ్యుల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 1987కంటే ముందు పత్రాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభు త్వ రంగాలు జారీ చేసే గుర్తింపు కార్డు లేదా పింఛన్ కార్డు, పాస్‌పోర్టు, విద్యార్హతలు, నివాస, కుల ధ్రు వీకరణ పత్రాలు, అటవీ హక్కుల పత్రం, సిటిజన్ సర్టిఫికెట్, ఫ్యామిలీ రిజిష్టర్, పట్టాదారు పాస్ పుస్తకంలో ఏదో ఒక డాక్యుమెంట్ తప్పనిసరిగా ఇవ్వా లి. చాలామందిలో చదువుకోని, ఎలాంటి ధ్రువపత్రాలు లేనివారు కుల ధ్రువీకరణ పత్రాలు చూపించాలి. దీంతో స్థానిక తహసీల్దార్ ఆఫీసుల నుంచి కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారు. అన్‌మ్యాప్ అయిన ఓటర్లు కూడా తాజాగా తగిన రుజు వు చూపిస్తూ బీఎల్వోల డిక్లరేషన్‌తోనూ తుది ఓట రు జాబితాతో నమోదు చేయవచ్చు. క్షేత్రస్థాయిలో ఓటరు పరిశీలనలతో జరుగుతున్న జాప్యంతో ఎ న్నికల కమిషన్ తుది జాబితా ప్రచురణకు గడువు ను అక్టోబర్ 15నుంచి నవంబర్ 9వరకు పొడిగించింది. అయితే, ఈ నెల 5వరకు ఓటర్ల అభ్యంతరా లు, ఫిర్యాదులు పరిష్కరించాల్సి ఉంది. ఆ తర్వాత కూడా మరో 10రోజుల గడువిచ్చే అవకాశముంది.
అన్‌మ్యాపింగ్, అనామలిస్ ఓటర్ల వివరాలు
నియోజకవర్గం జారీ చేసిన పెండింగ్ హియరింగ్ తుదిజాబితాకు
నోటీసులు నోటీసులు పూర్తి ఆమోదం
చెన్నూరు 57,380 2,671 24,800 1,12,075
బెల్లంపల్లి 45,370 832 24,469 1,13,786
మంచిర్యాల 68,218 5,387 42,368 1,50,105
మొత్తం 1,70,967 8,890 91,637 3,75,966


