బెల్లంపల్లి: బెల్లంపల్లి రైల్వేస్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జోనల్‌స్థాయి తైక్వాండో క్రీడాకారుల ఎంపిక పోటీలు అట్టహాసంగా జరిగాయి. పాత మంచిర్యాలలోని ద్రోణ తైక్వాండో అకాడమీకి చెందిన పలువు రు విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–14 బాలుర విభాగంలో నిర్వహించిన 25 కేజీల విభాగంలో ఎం.అవ్యుక్త్, 32 కేజీల విభాగంలో శ్రేయాన్స్, 35 కేజీల వి భాగంలో రిష్విత్, 38 కేజీల విభాగంలో జి.అయాష్, 41 కేజీల విభాగంలో నాగుల శశివర్ధన్, చెట్టి కౌ శిక్ కార్తికేయ విజేతలుగా నిలిచినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అండర్–17 బాలికల విభాగంలో నిర్వహించిన పోటీల్లో 35 కేజీల విభాగంలో సీహెచ్.శివ లాస్య, 55 కేజీల విభాగంలో కొల్లూరి హర్షిత పటేల్, 68 కేజీల విభాగంలో పెంట సహస్ర సత్తా చాటారు. స్వర్ణమయి పటేల్, సాయి రిషిక్, స్నేహిత్ తేజ తృతీయస్థానం దక్కించుకున్నారని ప్రకటించారు. ఎస్జీఎఫ్ సెక్రెటరీ యాకుబ్, తైక్వాండో అసో సియేషన్ ప్రతినిధులు వారిని అభినందించారు.


