పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పోస్టర్‌ ఆవిష్కరణ

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

పాతమంచిర్యాల: జాతీయ స్వచ్ఛంద రక్తదాత ల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్‌ సొసైటీ రక్తనిధి కేంద్రంలో గురువా రం నిర్వహించనున్న రక్తదాన సహాయ ఉద్య మ పోస్టర్‌ను బుధవారం డీఎంహెచ్‌వో నరేందర్‌ రాఽథోడ్‌ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదాతల దినోత్సవం సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరంలో అందరూ పాల్గొ ని రక్తదానం చేయాలని కోరారు. రక్తదాన స హాయ ఉద్యమంలో ఎన్జీవోలు, ఎన్‌సీసీలు స్వ చ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, సంచాలకుడు విశ్వేశ్వర్‌రెడ్డి, సీహెచ్‌వో వెంకటేశ్వర్లు, లయన్స్‌ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఫర్‌ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్స్‌ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో

మద్యం సేవిస్తే కఠిన చర్యలు

మంచిర్యాలక్రైం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠినచర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఓ ప్రకటనలో హెచ్చరించారు. సాధారణ ప్రజ లు, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం పోలీస్‌ కమి షనరెట్‌ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జి ల్లాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించ డం, అనుమతి లేకుండా డ్రోన్‌లు, డీజేల విని యోగం నిషేధం అమలులో ఉందని పేర్కొన్నారు. ఈ నెల 1నుంచి నవంబర్‌ 1వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపా రు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై బీఎంఎస్‌ సెక్షన్‌ 223, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ యాక్ట్‌ 1348 ఫసలీ నిబంధనల ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement