బెల్లంపల్లి: వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవా లని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బెల్లంపల్లి కేవీకేలో ఆత్మ ఆధ్వర్యంలో బుధవారం కిసాన్ మేళా నిర్వహించారు. సిర్పూర్ (టీ) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, కేవీ కే శాస్త్రవేత్తలతో కలిసి కలెక్టర్ మేళాను ప్రారంభించి స్టాళ్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పంటలు సాగు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులను ఎంపిక చేసి శా లువాలతో సన్మానించారు. అనంతరం కేవీకే ప్రాంగణంలో మొక్కలు నాటారు. ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, కేవీకే ఇన్‌చార్జి కోఆర్డినేటర్ మహే శ్, ఏఎంసీ చైర్మన్లు రత్నం సుకుమారి, రామగిరి బా నేశ్, అక్కల వెంకటేశ్వర్లు, దుర్గం లక్ష్మీనారాయణ, మహేశ్ ప్రసాద్ తివారి, ఆత్మ చైర్మన్లు సత్తయ్య, హనుమంతు, మురళి, రఘునందన్‌రెడ్డి, రైతులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
నెన్నెల: విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. నెన్నెల కేజీబీవీని సందర్శించి మధ్యాహ్న భోజనా న్ని పరిశీలించారు. అదనపు గదులు, వంటశాల, తరగతి గదులు, రిజిష్టర్లు, పరిసరాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఆయన వెంట ఎస్వో కవిత, ఉపాధ్యాయులున్నారు.


