వేడి నూనె పోసి రోకలిబండతో మోది.. | - | Sakshi
Sakshi News home page

వేడి నూనె పోసి రోకలిబండతో మోది..

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

● భర్తను హత్యచేసిన భార్య, కూతురు అరెస్ట్‌

మంచిర్యాలక్రైం: నిద్రిస్తున్న భర్త ముఖంపై వేడి నూనె పోసి రొకలిబండతో తలపై మోది హత్య చేసిన భార్య, కూతురిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. తన కార్యాలయంలో సీఐ వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని అశోక్‌రోడ్‌లో ఈ నెల29న వైద్య మోహన్‌(45) హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య జమున, ఆమె కూతురి కోసం గాలిస్తుండగా బుధవారం పట్టుకుని విచారించగా నేరం అంగీకరించారు. మోహన్‌న్‌–జమునకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లినాటి నుంచి భార్యను వేధింపులకు గురిచేసేవాడు. భరించలేక గత రెండేళ్లు కూతురితో కలిసి తల్లిగారింట్లో ఉంటోంది. మూడు నెలల క్రితం కుటుంబీకులు పంచాయితీ నిర్వహించి ఒప్పందంపై మంచిర్యాలలో ఉంచారు. ఈనెల 28 రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. తర్వాత నిద్రపోయారు. పథకం ప్రకారం 2 కిలోల వేడి నూనెను మరిగించి మోహన్‌ ముఖంపై పోశారు. గట్టిగా అరవడంతో రొకలి బండతో తలపై మోదగా అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితుల నుంచి రొకలి బండను స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో వారిని హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement