ఎఫ్‌బీవో ఆపరేషన్‌కు మార్గం సుగమం | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌బీవో ఆపరేషన్‌కు మార్గం సుగమం

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

నెన్నెల: మండల కేంద్రానికి చెందిన ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ గట్టు చి న్నయ్యకు ఉచిత ఆపరేషన్‌కు మార్గం సుగమమైంది. ఈ నెల 20న ‘కార్డు ఉన్నా అందని వైద్యం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ చుంచు రాధిక ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం స్పందించింది. చిన్నయ్య వివరాలను సేకరించి హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఈహెచ్‌ఎస్‌ కార్డు సమస్యను పరిష్కరించి వివరాలను ఆస్పత్రికి పంపించారు. దీంతో అపోలో ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్‌కు ఏ ర్పాట్లు చేశారు. తనకు అండగా నిలిచిన జిల్లా ఆరోగ్యశ్రీ సిబ్బందికి ఎన్‌ఈహెచ్‌ఎస్‌ సీఈవో తో పాటు సమస్యను వెలుగులోకి తెచ్చి ఆపరేషన్‌ జరిగేలా చేసిన ‘సాక్షి’ దినపత్రికకు చిన్న య్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement