రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

● జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● మత్తు పదార్థాలు నియంత్రించాలి

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో డీసీపీ ఏ.భాస్కర్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ పి.చంద్రయ్య, జిల్లా అటవీ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌, బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌తో కలిసి రహదారి భద్రత సమావేశానికి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ పరిధిలో స్పీడ్‌ బ్రేకర్లు, ఇతర రోడ్డు భద్రత సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై చెత్త, ఆటంకాలను తొలగించాలని, అనధికార వాహన నిలుపుదల, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. డీసీపీ భాస్కర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 429 ప్రమాదాలు జరిగాయని, 95 మంది మృతిచెందారని అన్నారు.

మాదకద్రవ్యాల నియంత్రణపై సమీక్ష

మాదకద్రవ్యాల నియంత్రణపై సమీక్షలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 63 కేసులు నమోదు చేశామని, ఇందులో 133 మందిని అరెస్టు చేసి 35 మందిని డ్రగ్‌ డి–అడిక్షన్‌ కేంద్రాలకు తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చామని తెలిపారు. విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో బెల్ట్‌షాపులు, పొగాకు ఉత్పత్తుల విక్రయం నిషేధించామని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ విలాయత్‌ అలీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement