అడవి అభివృద్ధితో ఉపాధి అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

అడవి అభివృద్ధితో ఉపాధి అవకాశాలు

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

జన్నారం: అడవులు అభివృద్ధి జరిగితే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్‌ అన్నారు. సొమవారం సాయంత్రం ఎఫ్‌డీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టైగర్‌జోన్‌ వల్ల అడవులు, వివిధ రకాల వన్యప్రాణులను సంరక్షించవచ్చని తెలిపారు. జీవ వైవిధ్యం పెరుగుతుందని, తడోబా, అందేరీ, తిప్పేశ్వర్‌ వలే ఇక్కడ కూడా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. టైగర్‌ రిజర్వ్‌ కోర్‌ ప్రాంతం చుట్టూ ఏర్పాటు చేసిన ఎకో సెన్సిటివ్‌ జోన్‌ ప్రజలను ఇబ్బందులు పెట్టే నిర్ణయం కాదని, వన్యప్రాణులు, పర్యావరణ హాని కారక కార్యకలాపాల నియంత్రించవచ్చని అన్నారు. స్థానిక ప్రజల జీవనో పాధి, అవసరాల దృష్ట్యా ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పరిధిని ఒక కిలోమీటర్‌కు తగ్గిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement