మంచిర్యాలఅగ్రికల్చర్: సామాజిక అన్యాయాలు, దోపిడీ, అణచివేతను ఎదురించి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, డీఆర్వో మోతీరామ్, కుల సంఘాల ప్రతినిధులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణేశ విగ్రహాల వినియోగంపై వాల్‌పోస్టర్లను కలెక్టర్ కుమార్ దీపక్ ఆవిష్కరించారు. మట్టి విగ్రహాల ద్వారా జలవనరుల కాలుష్యాన్ని నివారించవచ్చని తెలిపారు.


