ఏకదంతం.. దశాబ్దాల చరితం | - | Sakshi
Sakshi News home page

ఏకదంతం.. దశాబ్దాల చరితం

Sep 13 2026 11:57 PM | Updated on Sep 13 2026 11:57 PM

● నిర్విఘ్నంగా కొనసాగుతున్న నవరాత్రోత్సవాలు ● అప్పట్లో పరిమిత సంఖ్యలోనే విగ్రహాలు ● మట్టి గణేశులకు భక్తుల పూజలు ● భజనలతో మార్మోగిన మండపాలు ● నేటికీ ఐక్యత చాటుతున్న కమిటీలు

శివాలయ గణపతికి 50ఏళ్ల చరిత్ర

వేమనపల్లి: మండల కేంద్రంలోని అన్నపూర్ణ విశ్వేశ్వరాలయంలో 50 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో గణేశ్‌ నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులతోపాటు ఇతర కులాలవారు ఇక్కడ పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకొంటారు. తొమ్మిదిరోజులు విభిన్నంగా తీరొక్క నైవేద్యం వండి వినాయకుడికి సమర్పిస్తారు. సంప్రదాయ పద్ధతిలో నిత్య భజన, నిత్యాన్నదానం, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. చివరిరోజు గణపతి లడ్డూ, కలశం, దోవతి వేలం వేస్తారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.

1968లో మొదలై..

మంచిర్యాలఅర్బన్‌: పాత మంచిర్యాలలో 1968లో మొదలైన చవితి ఉత్సవాలు ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చంద్రమౌళి పంతులు ప్రోత్సాహంతో గౌతమి గణేశ్‌ మండలి ఏర్పాటైంది. అప్పట్లో అవుసుల సమ్మయ్య ఎంతో భక్తిశ్రద్ధలతో తయా రు చేసి ఇచ్చిన ఫీటున్నర మట్టి విగ్రహాలను ప్రజలంతా రామాలయం, శివాలయంలో నెలకొల్పేవారు. ఆ రోజుల్లో ఉత్సవాల నిర్వహణకు గ్రామంలో రూ.1 నుంచి రూ.5వరకు చందాలు సేకరించేవారు. సాయంత్రం వేళ గణపతి వద్దకు భక్తులు అధికసంఖ్యలో వచ్చేవారు. దీంతో ఊరంతా పండుగ వాతా వరణం కనిపించేది. ఊరంతటికీ ఒకే విగ్రహాన్ని నెలకొల్పడం అనాటి ప్రత్యేకత. పదేళ్లుగా గౌతమి యూత్‌ సభ్యులు ఎనిమిది ఫీట్ల విగ్రహాన్ని నెలకొల్పి భక్తిశ్రద్ధలతో నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా విభిన్న రూపాల్లో వినాయకుడు దర్శనమిస్తున్నాడు.

ఆధ్యాత్మిక శోభతో ఐక్యత చాటుతూ..

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న 24గంటల అఖండ భజన కార్యక్రమం ఆధ్యాత్మిక శోభతో ఐక్యతను చాటుతూ నేటికీ కొనసాగుతోంది. నిమజ్జనానికి ఒకరోజు ముందు భజ నతో ఊరు మార్మోగుతోంది. అప్పట్లో తొమ్మిది రోజులపాటు రాత్రివేళ ఊరిని మేల్కొలిపేలా భాగవతం, భజనలు, నాటికలు ప్రదర్శించేవారు. ఈ వివరాలన్నీ అప్పటి వేడుకల నిర్వహణలో ఒకరైన తూముల వెంకటరామయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement