హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

Sep 13 2026 11:57 PM | Updated on Sep 13 2026 11:57 PM

నస్పూర్‌: గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలులో విఫలమైందని పీఆర్టీ యూ టీఎస్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం సీసీసీ నస్పూర్‌లోని ఎంఎం గార్డెన్స్‌లో నిర్వహించిన పీఆర్టీ యూ జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరా రు. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని మెరుగైన పిట్మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఉద్యోగుల హెల్త్‌ స్కీం నిరాశపరిచిందని, ప్రభుత్వం కొత్తగా ఏ ఒక్క ప్రైవేట్‌ ఆస్పత్రితో ఎంఓయూ కుదుర్చుకోలేదని తెలిపారు. హెల్త్‌ స్కీంను ఇంప్లిమెంట్‌ చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మంచిర్యాల జిల్లాకు రెగ్యులర్‌ డీఈ వోను తక్షణమే నియమించాలని, 5,545 పీజీ హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలని కో రారు. మహిళలకు చైల్డ్‌ కేర్‌ లీవ్‌లు 90రోజుల నుంచి 180రోజులకు పెంచి సర్వీస్‌ మొత్తం ఉపయోగించుకునేలా సవరణ ఉత్తర్వులు ఇ వ్వాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు ఎంటీఎస్‌ మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌రెడ్డి, ప్రధాన కా ర్యదర్శి సుంకరి భిక్షంగౌడ్‌, జిల్లా అధ్యక్షుడు కొ ట్టె శంకర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చ మో హన్‌రావు, జిల్లా గౌరవాధ్యక్షుడు కొండు జనా ర్దన్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు జనగామ ఉ మాదేవి, ఆయా మండలాల అధ్యక్షులు, ప్రధా న కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement