మంచిర్యాలటౌన్: నస్పూరుకు చెందిన లగిశెట్టి స్పందన అమెరికాలోని చికాగో మెట్రో స్టేషన్‌లో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లి చికిత్స అనంతరం కోలుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావును తన తండ్రి శ్రీనివాస్‌తో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన స్పందన ఈ ఏడాది మే 31న ప్రమాదానికి గురి కాగా, ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నప్పుడు ఎమ్మెల్యే స్పందించారు. ఆమె తల్లిదండ్రులకు వారి కుమార్తెను చూ సేందుకు అవసరమైన పాస్‌పోర్టు, వీసాలను సీఎంవో అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు చేశారు. జూలై 2న స్పందన తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లగా, వారి విమాన టికెట్, ఇతర ఖర్చుల కోసం రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి వారికి అండగా ని లిచారు. పేద కుటుంబానికి చెందిన స్పందన చికి త్స అనంతరం కోలుకుని నస్పూరుకు వచ్చి ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేశ్ పాల్గొన్నారు.


