జన్నారం: అటవీశాకలో పనిచేస్తున్న ఇద్దరు ది నసరి ఉద్యోగుల వేతనాల చెల్లింపులో జాప్యం చేసినందుకు గోదావరిఖని లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు జప్తు చేసిన అటవీశాఖ డివిజన్ కార్యాలయం, తాళ్లపేట రేంజ్ కార్యాలయ సామగ్రిని హైకోర్టు ఆదేశాల మేరకు తిరిగి అప్పగించినట్లు ఎఫ్‌డీవో ఎం.రామ్మోహన్ తెలి పారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ 2025 జూన్ 10న ప్రభు త్వ చరాస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. కార్మిక న్యాయస్థానం ఆదేశాలను సవాల్ చేస్తూ కార్యాలయ సామగ్రి విడుదల కోసం అటవీ శాఖ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇవ్వడంతో జప్తు చేసిన ప్రభుత్వ వాహనం, కంప్యూటర్లు, బ్యాటరీలు, కుర్చీలు, ఇతర సామగ్రిని అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.


