చెన్నూర్‌రూరల్: మండలంలోని లంబడిపల్లిలో టసర్ పట్టు రైతులకు కకూన్ ఉత్పత్తి అనంతరం చేపట్టబోయే పోస్ట్ కకూన్ సాంకేతికతలు, విలువ ఆధారం, ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలపై సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం శాస్త్రవేత్త డాక్టర్ కె.పి కిరణ్‌కుమార్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సుమారు 204 మంది టసర్ పట్టు రైతులు హజరయ్యారు. ఇందులో 140 మంది మహిళ రైతులు పాల్గొనడం విశేషం. రీలింగ్ మిషన్ ద్వారా లైవ్‌ప్రాక్టికల్ డెమోను నిర్వహించారు. ఇందులో కకూన్లను ఉడికించే ప్రక్రియను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ పార్వతి, సర్పంచ్ నగావత్ మహేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.


