ఇంటి అద్దె నుంచి 164 మందికి ఊరట | - | Sakshi
Sakshi News home page

ఇంటి అద్దె నుంచి 164 మందికి ఊరట

Sep 7 2026 3:08 AM | Updated on Sep 7 2026 3:08 AM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ‘బెటాలియన్‌ క్వార్టర్లు శిథిలం’ శీర్షికన ఈనెల 4న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు చేయడంతో 164 మందికి ఇంటి అద్దె నుంచి ఉపశమనం లభించింది. గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్‌ బెటాలియన్‌లో 426 క్వార్టర్లు ఉండగా ఇందులో 300ల క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఆర్నెల్లుగా బెటాలియన్‌ సిబ్బంది ఇతర ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు. క్వార్టర్లకు మరమ్మతు చేయించకుండా ఇంటి అద్దె కటింగ్‌ చేయడంతో బెటాలియన్‌ సిబ్బంది ఇటీవల హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే పోలీస్‌ హౌజింగ్‌ బోర్డు, బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ నాగభూషణం ఆధ్వర్యంలోని కమిటీ పూర్తి విచారణ నేపథ్యంలో ఇటీవల వీరు చేసిన సిఫారసు ఆధారంగా 164 మంది కానిస్టేబుళ్లకు క్వార్టర్లు ఖాళీ చేయడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అద్దె అలవెన్స్‌లను తిరిగి చెల్లించడం జరుగుతుందని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement