కొలవార్‌ తెగ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

కొలవార్‌ తెగ సమస్యలు పరిష్కరించాలి

Sep 7 2026 3:08 AM | Updated on Sep 7 2026 3:08 AM

కోటపల్లి: కొలవార్‌ తెగ కులస్తుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూర్స పోచయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో కొలవార్‌ కులస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం మనకు అనేక హక్కులు కల్పించిందన్నారు. కొందరు చేస్తున్న దుష్ప్రచారం కారణంగా గిరిజన సంక్షేమశాఖ అధికారులు కొలవార్‌ తెగ విద్యార్థులు, ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకున్న కులం సర్టిఫికెట్స్‌ నిలిపివేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ అధ్యక్షుడు సుంకే కిష్టయ్య, కార్యదర్శి ఇగాం మారయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement