మంచిర్యాలటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పోషక విలువలు, నాణ్యతతో సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో కేంద్రీకృత వంటశాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్పాహారం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రత, విద్యాభ్యాసానికి తోడ్పతుందని తెలిపారు. అనంతరం అదే ఆవరణలో రూ.23.75 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవన నిర్మాణాలను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.


