మంచిర్యాలఅగ్రికల్చర్: పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవద్దని, జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు, బీఆర్‌ఎస్‌వీ జిల్లా నాయకుడు శ్రావణ్ మాట్లాడుతూ ఈ జీవో ద్వారా ఇంటర్మీడియెట్ చదవాల్సిన రావడం వల్ల సమయం వృథా అవుతుందని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బీఆర్‌ఎస్‌వీ నాయకులు మధు, రాజ్‌కుమార్, నరేష్, శ్రీకాంత్, సంపత్, విద్యార్థులు పాల్గొన్నారు.


