జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల నుంచి సేకరించిన శాంపిళ్లను ప్రత్యేకంగా కేటాయించిన వాహనాల ద్వారా సేకరించి టీహబ్‌కు తీసుకువచ్చి టెస్టులు చేస్తున్నాం. వైద్య పరీక్షలకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని పరీక్షలు చేపట్టకపోయినా జీజీహెచ్‌లో చేసేలా ఏర్పాటు చేశాం. టీహబ్‌కు అవసరమైన వైద్యుల నియామకం కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. సరిపడా ల్యాబ్ టెక్నీషియన్లు ఉండడంతో మూడు షిఫ్టుల్లో 24 గంటలు వైద్య పరీక్షలు అందిస్తున్నారు.
– డాక్టర్ అశోక్ కుమార్, జీజీహెచ్
సూపరింటెండెంట్


