శ్రావణం.. శుభకరం | - | Sakshi
Sakshi News home page

శ్రావణం.. శుభకరం

Aug 13 2026 12:09 AM | Updated on Aug 13 2026 12:09 AM

నేటి నుంచి ఆధ్యాత్మిక మాసం ప్రారంభం శుభ ముహూర్తాలు షురూ.. ఇంటింటా ప్రత్యేక పూజలు, ఉపవాస దీక్షలు ముస్తాబవుతున్న ఆలయాలు

వ్రతాలు, పండుగలు పవిత్రమైన శ్రావణ మాసంలో ఆధ్యాత్మిక వెల్లివిరియనుంది. ఇంటిటా ప్రత్యేక పూజలతో పాటు ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ మా సంలో మహిళలు మంగళవారాల్లో గౌరీపూజలు, శు క్రవారాల్లో లక్ష్మీపూజలు, శనివారాల్లో విష్ణుపూజలు చేస్తారు. శ్రావణ మొదటి సోమవారం 17న నాగుల పంచమి, మొదటి మంగళవారం 18న మంగళగౌరీ వ్రతం ప్రారంభం కానుంది. 28న అక్కాచెల్లెళ్లు త మ అన్నదమ్ముల క్షేమాన్ని కోరుకుంటూ రక్షాబంధ న్‌ కడతారు. సెప్టెంబర్‌ 4న లోక రక్షణ కోసం విష్ణుమూర్తి కృష్ణుడిగా అవతరించిన పవిత్ర దినం కృష్ణాష్టమి జరుపుకోనున్నారు. సెప్టెంబర్‌ 11న పొలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగియనుంది.

వ్యాపారులకు ఊరట..

దాదాపు 60 రోజులుగా వివాహలకు ముహూర్తాలు లేకపోవడంతో ప్రధానంగా పెళ్లిళ్లపై ఆధారపడి వ్యాపారాలు సాగిస్తున్న కల్యాణ మండపాలు, వస్త్ర, నగల దుకాణాలు వెలవెలబోయాయి. పెళ్లి తంతు నిర్వహించే పురోహితులు ఖాళీగా ఉన్నారు. ఫొటోగ్రాఫర్లు, క్యాటరింగ్‌, డెకరేషన్‌, భోజనాల తయారీదారులు డీలా పడ్డారు. శ్రావణ మాసం రాకతో వారికి ఊరట లభించనుంది.

ఆలయాలు ముస్తాబు

శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పవిత్రోత్సవాలు, తిరునక్షత్రాలు, భగవద్గీత పారాయణాలు, విష్ణు సహస్ర పారాయణాలు, శ్రీలలితా సహస్ర పారాయణాలు, కుంకుమ పూజలు నిర్వహించడానికి ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు.

శుభముహూర్తాలు

ఆగస్టు 15, 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 30, సెప్టెంబర్‌ 3, 4 ,5, 8, 10 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయి. వివాహలు, నిశ్చితార్థాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, అక్షరాభ్యాసాలు, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహించనున్నారు.

హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ప్రత్యేక విశిష్టత ఉంది. శ్రావణ మాసం శివునికి ప్రీతి పాత్రమైనది కావడంతో ఈ నెల రోజులు పాటు శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రమే కావడం ఈ మాసానికి మరింత ప్రాముఖ్యత వచ్చింది. శుభాలను కలిగించే శ్రావణమాసం గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.

– మంచిర్యాలఅర్బన్‌/నిర్మల్‌చైన్‌గేట్‌/చెన్నూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement