చెన్నూర్/జైపూర్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం జైపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం, చెన్నూర్‌లోని కేజీబీవీని సందర్శించారు. తరగతి గదులు, మూత్రశాలలు, వసతి, వంటశాల, సామగ్రి నిల్వ గది, పరిసరాలు, నిర్మాణాలు పరిశీలించారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని తెలిపారు. పాఠశాలల్లో మరమ్మతులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు. గురుకులం ప్రిన్సిపాల్ నాగేశ్వర్‌రావు, చెన్నూర్ ప్రత్యేకాధికారి సుమలత పాల్గొన్నారు.


