ఫిజియోథెరపి ప్రాక్టీస్‌పై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఫిజియోథెరపి ప్రాక్టీస్‌పై చర్యలు తీసుకోవాలి

Aug 13 2026 12:09 AM | Updated on Aug 13 2026 12:09 AM

మంచిర్యాలటౌన్‌: అర్హతలు, వృత్తిపరమైన రిజిస్ట్రేషన్‌ లేకుండానే అందిస్తున్న ఫిజియోథెరపి సేవలపై బుధవారం జిల్లాలోని అర్హత కలిగిన ఫిజియోథెరపిస్టులు, తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌రాథోడ్‌కు వినతిపత్రం అందజేశారు. లక్సెట్టిపేట్‌లోని స్టార్‌ ఫిజియోథెరపి సెంటర్‌లో డాక్టర్‌ విజ య్‌కుమార్‌ రిజిస్ట్రేషన్‌, సేవల పరిధిని అధికారికంగా పరిశీలించాలని కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి తక్షణమే స్పందించి ఫిజియోథెరపి సెంటర్‌ను మూసివేయించారు. తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ యెగ్గన శ్రీనివాస్‌ మాట్లాడుతూ అనధికార వైద్య సేవలు, తప్పుడు అర్హతలతో ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలను అరికట్టేందుకు తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ పనిచేస్తోందని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు నీలం సురేందర్‌, గొట్టె శ్యాంసుందర్‌, అజయ్‌కుమార్‌, ఓ దేలు, తేజస్విని, అనిల్‌, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement