‘ముంపు బాధితులకు చేసిందేమీ లేదు’ | - | Sakshi
Sakshi News home page

‘ముంపు బాధితులకు చేసిందేమీ లేదు’

Aug 13 2026 12:09 AM | Updated on Aug 13 2026 12:09 AM

మంచిర్యాలటౌన్‌: ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులకు మాజీ ఎమ్మెల్యే ఎన్‌.దివాకర్‌రావు చేసిందేమీ లేదని, అంత చిత్తశుద్ధి ఉంటే పెండింగ్‌లో ఉన్న పరిహారం ఆయన హయాంలో ఎందుకు చెల్లించలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ ప్రశ్నించారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కమీషన్లు తీసుకున్నారని, బీఆర్‌ఎస్‌ హయాంలో వడ్ల బస్తాకు మూడు నుంచి ఐదు కిలోలు కోత విధించి రైస్‌మిల్లర్ల వద్ద కమీషన్‌ తీసుకున్నారని ఆరోపించారు. ఆయన వైఫల్యం వల్లే నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని అన్నారు. రైతుల కోసం పోరాటం చేస్తున్నామని ఆయన, ఆయన కుమారుడు చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. పెండింగ్‌లో ఉన్న పరిహారం చెల్లించాలని బీజేపీ నాయకుడు రఘునాథ్‌ వెరబెల్లి నిరసనలు, ఆందోళన చేశారని, బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు. నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, జయరామారావు, కమలాకర్‌రావు, కుర్రె చక్రవర్తి, రంగ శ్రీశైలం, ఆడె ప్రేమ్‌సింగ్‌, కల్వచర్ల అనిల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement