పాతమంచిర్యాల: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేసేంత వరకు పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా నాలుగో మహాసభ ని ర్వహించారు. ముందుగా సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య జెండా ఆవిష్కరించారు. అనంత రం పట్టణంలోని వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేళ్ల పో రాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాల ను కార్పొరేట్‌కు అనుకూలంగా మలిచారన్నారు. ఈ నెల 6 నుంచి 8 వరకు కరీంనగర్‌లో రాష్ట్ర మ హాసభ, డిసెంబర్‌లో బెంగళూర్‌లో జాతీయ మహా సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతా రామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అక్బర్ అలీ, ప్రధాన కార్యదర్శి మేకల దాసు, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు ఖలిందర్ అలీఖాన్, తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గం ఎన్నిక
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అక్బర్ అలీ, ప్రధాన కార్యదర్శిగా మేకల దాసు, గౌరవ అధ్యక్షుడిగా మిట్టపల్లి వెంకటస్వామి, ఉపాధ్యక్షులుగా ముస్కె సమ్మయ్య, మిట్టపల్లి పౌలు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఖలిందర్ అలీఖాన్, కార్యదర్శులుగా తోక ల సరస్వతి, అఫ్రోజ్‌ఖాన్, కోశాధికారిగా దాగం మల్లేశ్ ఎన్నికయ్యారు. ఎన్నికయ్యారు.


