మంచిర్యాలటౌన్: భారీ వర్షాలకు కూలిన వంతెనలు పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అధికా రులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రాళ్లవాగుపై ఉన్న క్వారీ రోడ్డు బ్రిడ్జి అప్రోచ్‌రోడ్డు కోతకు గురైన ప్రాంతాన్ని, రంగంపేట్ వెళ్లే దారిలో కాజ్‌వేను ఆదివారం పరిశీలించారు. అనంతరం రాళ్లవాగు వద్ద జరుగుతున్న పైప్‌లైన్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. త్వరగా పూర్తిచేసి ప్రజలకు తా గునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నా రు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జి.అన్వేష్, మేయర్ దర్ని మధుకర్, డీఈ రాజేందర్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు తూముల నరేష్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఎంసీసీ యాజమాన్యంపై ఆగ్రహం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): క్వారీ దుర్గాదేవి జాతర విషయంలో ఎంసీసీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు కలిగిన ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే గఢ్‌పూర్ గ్రామ పంచాయతీతో పాటు ఎంసీసీ యాజమాన్యం కూడా సంయుక్తంగా కనీస వ సతులు కల్పించాల్సి ఉండగా ఎంసీసీ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. హుండీ ఆదాయాన్ని పంచా యతీ స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఎంసీసీ భూములను అవసరమైతే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట మేయర్ ధర్ని మధుకర్, కార్పోరేటర్ తూముల నరేశ్ ఉన్నారు.


