తల్లిపాలను పట్టడం వల్ల బిడ్డలో రోగ నిరోధక శక్తి పెంపొంది, ఆరోగ్యంగా ఉంటారు. పుట్టిన నాటి నుంచి బిడ్డ తాగినన్ని రోజులు తల్లి పాలు ఇవ్వాలి. ఆరు నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలి. ఆతర్వాత పౌష్టికాహారం అందిస్తూ, తల్లిపాలు ఇవ్వాలి.
– డాక్టర్ నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో
ప్రాముఖ్యతను వివరిస్తున్నాం
ఏటా ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. తల్లిపాల విశిష్టతను తెలిపేలా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన కల్పిస్తున్నాం. గర్భిణులు, బాలింతలు తల్లి పాల విశిష్టతను తప్పకుండా తెలుసుకోవాలి.
– రౌఫ్‌ఖాన్, జిల్లా సంక్షేమాధికారి


