ఇచ్చోడ: ప్రకృతి అందాలు, పచ్చని అడవులు, జాలువారే జలపాతాలకు ఆదిలాబాద్ జిల్లా పేరుగాంచింది. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడినవి ఎన్నో ఉన్నాయి. వర్షాకాలంలో కుంటాల, గాయత్రి, పొచ్చెర, కోర్టికల్, పెద్దగుండం జలపాతాల అందాలు చూసేందుకు దూరప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. చాలాచోట్ల రోడ్లు, సౌకర్యాలు లేవు. బస చేయడానికి వసతులు లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం చెబు తున్నా నిధులు మంజూరులో నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తోంది. గతంలో రాష్ట్ర పర్యాటక, అటవీశాఖల ప్రిన్సిపాల్ సెక్రెటరీలు కుంటాల జలపాతాన్ని సందర్శించారు. రోప్‌వే ఏర్పాటు, కుంటాల దిగువ భాగం కడెం నదిలో పర్యాటకులకు బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్న హామీ ఇచ్చారు. ఇప్పటికి నిధులు మంజూరు కాలేదు.
సరైన రోడ్లు లేక..
పొచ్చెర మినహా గాయత్రి, కనకాయి, కొర్టికల్, పెద్దగుండం, ఘన్‌పూర్ జలపాతాలకు వెళ్లడానికి సరైన రోడ్లు లేవు. గాయత్రి వద్ద 2016, 2022లో రెండు సార్లు హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ ఆధ్వర్యంలో రాపెల్లింగ్ పోటీలు నిర్వహించారు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పర్యాటకులు రావడం లేదు. దాదాపు 4 కి.మీ కాలినడకన వెళ్తే కానీ అక్కడికి చేరుకోలేం. కనకాయి, పెద్దగుండం, ఘన్‌పూర్ జలపాతాలకు రోడ్లు లేకపోవడంతో సందర్శించడానికి రావడం లేదు.
కుంటాల జలపాతం వద్ద పర్యాటకులు
ఇలా వచ్చి అలా వెళ్తూ..
రాష్ట్రంలో ఎత్తైన జలపాతంలో కుంటాల ఒ కటి. రెండు ఎత్తయిన కొండల మధ్య ఉన్న జలపాతం అందాలు చూడాలంటే దాదాపు 408 మెట్లు కాలినడకన కిందికి దిగాలి. వ యస్సుపైబడినవారు జలపాతాన్ని చూడకుండా వెనుదిరుగుతున్నారు. రోప్‌వే ఏర్పా టు చేస్తేనే వీటిని అందాలు చూడవచ్చు. గైడ్‌లు, జలపాతం వద్ద ప్రమాద హెచ్చరికబోర్టు లేకపోవడంతో ప్రమాదాలకు గురైన ఘటనలున్నాయి. గత రెండేళ్ల క్రితం రూ.2 కోట్లతో పర్యాటకుల బస చేయడానికి రిసార్టుల నిర్మాణాన్ని ప్రారంభించారు. రెండేళ్లు కావస్తున్న పనులు పూర్తికాలేదు. హైదరా బాద్‌తోపాటు దూరప్రాంతాల నుంచి వచ్చేవారు నిర్మల్ లేదా ఆదిలాబాద్‌లో హోటళ్లలో బస చేసి కుంటాలకు రావాల్సి ఉంటుంది. ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు.


